వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కులాలకు, మతాలకు అతీతంగా రైతులకు సహాయం చేస్తున్నామని చెప్పారు. 

 

తొలి విడతగా నేడు రైతులకు 2,800 కోట్లను జగన్ సర్కార్ విడుదల చేసింది. రైతు భరోసా కింద ప్రతీ అన్న దాతకు ఏడాదికి 13,5 00 సహాయం చేస్తున్నామని అన్నారు. 1.5 ఎకరాలు ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని జగన్ వివరించారు. ఏ రైతుకు అయినా ఇబ్బంది ఉంటే 1902 కి ఫోన్ చేయవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ప్రతీ విషయంలో రైతులకు మంచి జరగాలని తమ ప్రభుత్వం భావిస్తుందని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రైతులకు అండగా ఉంటామని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: