ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పెట్టుబడి సాయం చేయడానికి గానూ ఏపీ సర్కార్ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఇప్పుడు రైతుల కోసం 5,500 ఇస్తున్నామని ఏప్రిల్ లో రెండు వేలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. అక్టోబర్ లో 4 వేలు సంక్రాంతికి మరో రెండు వేలు ఇస్తామని జగన్ పేర్కొన్నారు. 

 

ఎవరు పేర్లు అయినా రైతు భరోసా లో మిస్ అయితే గ్రామ సెక్రటరి ద్వారా నమోదు చేసుకోవాలని కౌలు రైతులకు కూడా తాము ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నామని అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు ఎవరూ కూడా పెట్టుబడి సాయం లేక ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించే బాధ్యత తీసుకుంటామని అన్నారు.ఎవరికి అయినా సాయం అందకపోతే 1902 కి ఫోన్ చెయ్యాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: