ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు. రైతుల ఖాతాలలో 5,500 రూపాయలు ఈరోజు జమవుతాయని సీఎం జగన్ చెప్పారు. అక్టోబర్ లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు జమ చేస్తామని అన్నారు. ఈ క్రాపింగ్ ద్వారా పంటలకు రుణాలు ఇప్పిస్తామని అన్నారు. రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే మిగిలిన ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. 

 
నగదు బదిలీ కాకుంటే 1902 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. ఈ క్రాపింగ్ తో వ్యవసాయంలో ఎన్నో మార్పులు వస్తాయని అన్నారు. రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడకూడదని అన్నారు. రైతులకు ఎంత చేసినా తక్కువే అని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: