రైతులకు పెట్టుబడి సాయం చేయడానికి గానూ సిఎం వైఎస్ జగన్ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని 10, 641 కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అన్నీ అందుబాటులో ఉంటాయని జగన్ ఈ సందర్భంగా వివరించారు. 

 

వాటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు. రైతులకు ఎక్కడా కూడా మోసపోకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆ విధంగానే పని చేస్తుంది అని చెప్పారు. ప్రతీ గ్రామంలో అగ్రి కల్చరల్ అసిస్టెంట్ పని చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నా అంటూ మాట్లాడారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: