ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా నిధులను సిఎం వైఎస్ జగన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా జగన్ రైతులతో స్వయంగా మాట్లాడారు. వారి కష్టాలను ఆర్ధిక ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు జగన్. రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని సిఎం ఈ సందర్భంగా వివరించారు. వాటి ద్వారా అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 

ఇక ఈ సందర్భంగా జగన్ దేశంలోనే ఎవరు తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. కేవ‌లం 11 నెల‌లు మాత్ర‌మే పంట హ‌క్కులు కౌలుదారుల‌కు రైతుల‌కు భూహ‌క్కులు ఉంటాయని జగన్ చెప్పారు. ఇక కౌలు దారులకు కూడా రైతు భరోసాను అందించే విధంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. వారికి కూడా 7500 సహాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ వివరించారు. పాత అప్పులకు రైతు భరోసాకు సంబంధం లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: