ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. రైతుల ఖాతాలలో 5,500 రూపాయలు జమ చేస్తామని అన్నారు. ఒక రైతు జగన్ తో మాట్లాడుతూ వైయస్సార్ హయాంలో పంటలు బాగా పండాయని... రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. రైతులను రాజులుగా చూడాలని వైయస్సార్ ఆకాంక్షించారని అన్నారు. వైయస్సార్ ను తలచుకుని రైతు కంటతడి పెట్టారు. 

 

దురదృష్టవశాత్తూ వైయస్సార్ మరణించారని... ఆయన మరణంతో రైతాంగం ధీన స్థితిలోకి వెళ్లిందని చెప్పారు. వైయస్సార్ మరణం తర్వాత రైతులు చీకటి రోజులు గడిపారని రైతు చెప్పారు. గత ప్రభుత్వం రెయిన్ గన్ లు ఇచ్చిందని దాని వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. రైతు వైయస్సార్ గురించి మాట్లాడుతున్న సమయంలో సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: