ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కరెంట్ బిల్లుల గురించి స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చిందని అన్నారు. 2 నెలలుగా మీటర్ రీడింగ్ తీయకపోవడంతో... కరెంట్ వినియోగం పెరిగి బిల్లులు ఎక్కువగా వచ్చాయని అన్నారు. జూన్ 30వ తేదీ వరకు ప్రభుత్వం కరెంట్ బిల్లుల చెల్లింపుకు గడువు ఇస్తే ఈనాడు జూన్ 15 వరకు గడువు చెల్లింపులకు అవకాశం ఇచ్చినట్టు రాసిందని అన్నారు. 
 
ఎల్లో మీడియా కరెంట్ బిల్లులపై అసత్య ప్రచారం చేస్తోందని చెప్పారు. కరెంట్ బిల్లుల విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని అన్నారు. రెండు బిల్లులు ఒకేసారి రావడంతో బిల్లులు ఎక్కువగా వచ్చాయని అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఎల్లో మీడియా తప్పుడు రిపోర్టింగ్ తో ప్రజలకు పక్కదారి పట్టిస్తోందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: