మనం తినే పండ్లలో ఎంతో మధురమైన తీపి.. సువాసనతో నిండింది పనస పండు. ఇది కేవలం తన మధురమైన తిపితో కడుపు నింపడమే కాదు.. ఎంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.  పనస పండ్లను కూరలు కూడా వండుకుంటారు.. పనన బిర్యాని ఫేమస్ అంటారు.  సాధారణంగా  నోరూరించే పనసపండు ఎంత బరువు ఉంటుంది? పది కేజీలు, 20 కేజీలు…మహా అయితే 30 కేజీలు! కానీ అలా కాస్తే తన వెరైటీ ఎం ఉంటుందనుకుందో ఏమో కేరళలో ఓ పనస పండు తనను తినే మనిషి అంత బరువు పెరిగింది.  కుల్లాం జిల్లాలో ఎడములక్కల్ గ్రామంలో ఓ కుటుంబం ఇంటి వెనకాల ఉన్న పెరటిలో ఇంత పెద్ద పనసపండు లభించినట్లు సదరు కుటుంబ సభ్యులు తెలిపారు.   

 

దీని బరువు అక్షరాలా  51.4 కేజీలు తూగి కేక పెట్టింది.  పెరట్లోంచి ఇంట్లోకి తీసుకురావడానికి తాళ్లు కట్టి మరీ లాక్కొచ్చారు. రాష్ట్రంలో ఇంతపెద్ద పనసు పండును చూడ్డం ఇది తొలిసారి అని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.  గతంలో మహారాష్ట్రలోని పుణేలో 42.72 కిలోల పనస పండింది. అప్పటికే అదే రికార్డు. కేరళ పండు దాన్ని బద్దలు కొట్టేయడంతో ఇక గిన్నిస్ సర్టిఫికెట్ రావడమే తరువాయి.  ఒక్క గిన్నిస్ రికార్డే కాదు.. లిమ్కా రికార్డ్స్ కు కూడా తాను దరఖాస్తు చేశాయని పండు యజమాని జాన్ కుట్టి చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: