చైనా రాజధాని వుహాన్ లో ఈరోజు నుంచి కరోనా పరీక్షలు మొదలయ్యాయి. కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన వుహాన్ లో 76 రోజుల లాక్ డౌన్ తర్వాత తాజాగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం వుహాన్ నగరంలోని ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వుహాన్ నగరంలో కోటీ పది లక్షల మందికి కరోనా పరీక్షలు జరగనున్నాయి. 
 
చైనా ప్రభుత్వం పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు కరోనా పరీక్షల కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రజలు స్వతంత్రంగా కరోనా సెంటర్ల దగ్గరకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. ఈరోజు చైనాలో కొత్తగా 4 కేసులు నమోదు కాగా మొత్తం 91 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: