ఆంధ్రప్రదేశ్ జీవనాడి గా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన సలహాదారుని తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్. ప్రభుత్వ సలహాదారు హెచ్‌కే సాహును తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా ఉన్న సాహుని తప్పించడానికి గానూ ఉత్తర్వులు ఇచ్చింది. 

 

శుక్రవారం మధ్యాహ్నం జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసారు. 2018 ఏప్రిల్‌ 14న సాహుని కన్సల్టెంట్‌గా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహు తన సేవలను అందిస్తున్నారు. ఆయన పని తీరు సంతృప్తికరంగా లేకపోవడం తోనే మార్చినట్టు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: