ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ కి మందు కనుక్కునే పనిలో పడ్డారు. అన్ని దేశాల శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది సాధ్యం కావడం లేదు. బ్రిటన్, అమెరికా, ఇటలీ, చైనా ఫ్రాన్స్ సహా కొన్ని దేశాలు అదే పనిలో ఉన్నాయి. 

 

ఇప్పుడు తాజాగా బ్రిటన్ ఈ విషయంలో కీలక అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్ ని కోతులకు ఎక్కించి ప్రయోగం చేయగా అది సక్సెస్ అయింది. కోతుల్లో పెరిగిన రోగ నిరోధక శక్తి వైరస్ ని అడ్డుకుంది అని గుర్తించారు. కోతులకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అని పేర్కొన్నారు. కోతులకు కరోనా వైరస్ ఎక్కించి ఈ ప్రయోగం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: