ఇప్పటి వరకు మనిషి తాము భూమి, ఆకాశం, నీరు ని జయించామని గొప్పగి చెబుతూ వస్తున్నాడు.. కానీ ఇప్పుడు ఒక్క కరోనా వైరస్ తో మాత్రం గిల గిలా కొట్టుకుంటున్నాడు.  ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో కేసులు.. రెండు లక్షల చేరువలో మరణాలు సంబవించాయంటే.. కరోనా ఎంతటి భయంకరమైన వైరస్ అన్న విషయం తెలిసిపోతుంది. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తుంది. చిన్న దేశాలే అనుకుంటే.. ఇప్పుడు అమెరికా, బ్రెజిల్, యూకేలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే లక్ష కేసులు నమోదు కాగా, అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి.

 

భారత్‌లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి.  అమెరికాలో నిన్న 1,703 మంది మరణించారు. స్పెయిన్‌లో 217 మంది, బ్రిటన్‌లో 428 మంది, ఇటలీలో 262 మంది, బ్రెజిల్‌లో 835 మంది, ఫ్రాన్స్‌లో 351 మంది మెక్సికోలో 294 మంది, కెనడాలో 170 మంది కరోనా కాటుకు బలయ్యారు.  ఇక  ప్రపంచంలో సంబవించిన మరణాల్లో మూడో వంతు.. గా 86,900 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: