నాడు నేడు ప్రజారోగ్యంపై ఏపీ సిఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులతో ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళిక సిద్దం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల పై రూ 16,203 కోట్లను ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చ్ లోగా వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ లు ఏర్పాటు చేయనున్నారు. 

 

10 వేలకు పైగా హెల్త్ క్లీనిక్ ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల 26 కోట్లను కేటాయిస్తుంది. పీ హెచ్ సి కమ్యూనిటి హెల్త్ సెంటర్లు ఏరియా ఆస్పత్రులు అభివృద్ధి చేయనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ కి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అవుతాయి. 149 కొత్త పీహెచ్ సిల నిర్మాణం కోసం 256.99 కోట్లను కేటాయించారు. 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు నేడు కింద 695 కోట్లను కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: