దేశంలో కరోనా వైరస్ ఎప్పటి నుంచి మొదలైందో కానీ.. ఎవ్వరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది.  ఒకటి కాదు రెండు కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కేసులు... రెండు లక్షల చేరువలో మరణాలు సంబవించాయి.  ఇక మొన్నటి వరకు వలస కూలీలకు తమ స్వస్థలాలకు వెళ్లే ఛాన్సు లేకుండా పోయింది.. కానీ కేంద్రం ఇక నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తమ స్వస్థలాలకు వెల్లితే.. తప్పని సరి క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్వారంటైన్ సెంటర్ వద్ద ఓ వలస కార్మికుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న ఓ క్వారంటైన్ సెంటర్ వద్ద చోటు చేసుకుంది.

 

ఈ మద్య జిల్లాలోని రైకమా గ్రామానికి చెందిన 38 ఏళ్ల సురేంద్ర బెహెరా అనే వలస కార్మికుడు తన భార్యతో కలిసి ఏపీలోని విజయవాడ నుంచి 6 రోజుల క్రితం వచ్చాడు. అయితే కారణం తెలియదు కానీ.. అధికారులు భార్యాభర్తలిద్దరినీ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. ఏమైందో తెలియదు గానీ, తెల్లారేసరికి సురేంద్ర బెహరా చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతదేహం వద్ద అతని భార్య కన్నీరు మున్నీరవడం పలువురిని కలిచివేసింది.  కాగా,  అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: