దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు ఒక‌టి. మ‌హారాష్ట్ర త‌ర్వాత త‌మిళ‌నాడులోనే వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. రోజుకు వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 447 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,674కు చేరింది. శుక్రవారం కొత్తగా మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య కూడా 66కు చేరింది. మరో 2,240 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం 7,365 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి

 

. ప్రస్తుతం వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్ర‌ధానంగా చెన్నైలోని కోయంబేడు మార్క‌ట్ కేంద్రంగా వైర‌స్ వ్యాప్తి వేగంగా జ‌రిగింది. ఈ ప్ర‌భావం కార‌ణంగానే కేసులు ఎక్క‌వ‌గా న‌మోదు అవుతున్నాయి. అంతేగాకుండా.. కోయంబేడు మార్క‌ట్ లింకులున్న కేసులు ఏపీలోనూ అధికంగా న‌మోదు అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: