విశాఖ‌లోని ఆర్ ఆర్ వెంక‌టాపురం గ్రామ స‌మీపంలో ఉన్న ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో విష‌పూరిత‌మైన స్టెరిన్ వాయువును పీల్చి 12 మంది మృతి చెంద‌గా.. సుమారు ఐదు గ్రామాల‌కు చెందిన బాధితులు ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన సీఎం జ‌గ‌న్ వెంట‌నే బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, వారికి ప‌రిహారం ప్ర‌క‌టించి 24గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

 

అలాగే.. గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌పై గ్రీన్ ట్రిబ్యున‌ల్ కూడా స్పందించి, కంపెనీకి నోటిసులు ఇచ్చింది. రూ.50కోట్లు చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో కంపెనీ దిగొచ్చింది.. ఈరోజు విశాఖ క‌లెక్ట‌ర్‌కు రూ.50కోట్ల చెక్కును కంపెనీ ప్ర‌తినిధులు అంద‌జేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: