ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జీవో నెంబర్ 205 ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కృష్ణా నది వరద జలాలను కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తోడుకోవాలని భావించిన ఏపీ సర్కార్ దీనిపై జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న తెలంగాణ సర్కార్. కృష్ణ యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేయగా దీనిపై స్పందిస్తూ ఈ మేరకు ఏఏపీ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది కృష్ణా యాజమాన్య బోర్డు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తెలంగాణలో ఇటు ఏపీలో కూడా రాజకీయ రచ్చ దారి తీసింది. కరోనాఉన్న తరుణంలో జరిగిన ఈ పరిణామంపై రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే విధంగా వెళ్ళింది అనేది వాస్తవం.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు ఏపీ పాలకులు మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణలోని అధికార విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: