తెలంగాణలో కరోనా వైర‌స్ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా కేసులు న‌మోదు అవుతున్నాయి. శుక్రవారం మళ్లీ 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా... అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 33 కేసులు ఉన్నాయి. ఇందులో మంగళ్‌హాట్‌లోనే ఏకంగా 16 కేసులు నమోదయ్యాయి. మలక్‌పేట్‌ అక్బర్‌బాగ్‌లో ఒకే ఇంట్లో ఆరు పాజిటివ్‌ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఇరుకైన గదుల్లో 5 నుంచి 10 మంది దాకా కలసి నివసిస్తుండటం, భౌతిక దూరం పాటించక పోవడంతో ఇక్కడ ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. మంగళ్‌హా ట్‌ కామటిపురలో ఓ వస్త్రదుకాణంలో పని చేసే 45 ఏళ్ల వ్యక్తికి ఈ నెల 11న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే.. ఒకేచోట ఉన్న ఆరు కుటుంబాలకు కలిపి ఒక్క‌టే బాత్‌రూమ్ ఉంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వాడిన మరుగుదొడ్డినే అక్కడే ఉన్న మరో 30 మంది ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు వెంట‌నే వారిని క్వారంటైన్‌కు పంపారు.

 

వారికి నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 15 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఇక శుక్ర‌వారం న‌మోదు అయిన కేసుల్లో 7 కేసులు వలసదారులకు సంబంధించినవని. రాష్ట్రంలో మొ త్తం కరోనా కేసుల సంఖ్య 1,454కు చేరుకుంది. శుక్రవారం 13 మం ది కోలుకున్నారు. వారిలో హైదరాబాద్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వికారా బాద్, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరున్నారు. ఈ 13 మంది తో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 959 మం ది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తుతం 461 మంది చికిత్స పొందుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: