వాస‌న‌ను ప‌సిగ‌ట్ట‌డంలో కుక్క‌ల పాత్ర అంద‌రికీ తెలుసు. నేర ప‌రిశోధ‌న‌లో కుక్క‌లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఇప్పుడు కరోనా వైర‌స్‌పై జ‌రుగుతున్న పోరులోకి కుక్క‌ల‌ను రంగంలోకి దింపుతోంది బ్రిట‌న్‌. ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారో లేదో గుర్తించ‌డానికి కుక్క‌ల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, డర్హామ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఈ పరిశోధన కోసం ఏక‌గా 500,000 పౌండ్లను బ్రిట‌న్  కేటాయించింది. నిజానికి.. ఇప్ప‌టికే కుక్క‌లు క్యాన్స‌ర్‌, మ‌లేరియా వంటి వ్యాధుల‌బారిన‌ప‌డిన వారిని  గుర్తిస్తున్నాయి.

 

అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు క‌రోనా వైర‌స్‌ను గుర్తించేందుకు వాటికి శిక్ష‌ణ ఇస్తున్నారు ప‌రిశోధ‌కులు. త‌మ ప్ర‌య‌త్నం క‌చ్చితంగా మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని మంత్రి జేమ్స్ బెథెల్ చెప్పారు. ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైతే.. ఒక కుక్క గంట‌కు 250మందిని ప‌రీక్షిస్తుంద‌ని, ఇది బ‌హిరంగ ప్ర‌దేశాలు, వినామానాశ్ర‌యాల్లో ఎంత ఉప‌యోగ‌క‌రంగ ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. అంతేగాకుండా.. యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ పరిశోధకులు కూడా క‌రోనా వ్యాధిని గుర్తించడానికి కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: