దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణ వల్ల కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తే మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. కరోనా సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ప్రముఖ సంస్థ ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ కరోనా కష్ట కాలంలో ఉద్యోగుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
 
సిబ్బందిలో ఆత్మైస్థెర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో కంపెనీ జీతాలు పెంచినట్లు తెలుస్తోంది. సంస్థ అమ్మకాల విభాగం సిబ్బందికి బీమాతో పాటు మందుల ఖర్చులకు సహాయం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 35 కోట్లు సహాయం చేసిన ఏషియన్ పెయింట్స్ కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాలకు 40 కోట్ల రూపాయలు బదిలీ చేసింది. ఏషియన్‌ పెయింట్స్‌ ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కంపెనీలో పని చేసే సిబ్బంది బాగోగులు చూసుకోవడం కంపెనీ బాధ్యత అని చెప్పారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను బోర్డు డైరెక్టర్లకు వివరించి సిబ్బందికి ప్రయోజనాలను చేకూరుస్తున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: