ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇక తిరుగు ఉండదు అనేది చాలా మంది ప్రజా ప్రతినిధుల అభిప్రాయం. వారు పని చేసినా చేయకపోయినా ఎవరూ అడిగే అవకాశం ఉండదు అనేది వాళ్ళ భావన కూడా. అలాంటి వారికి షాక్ ఇవ్వాలని భావిస్తుంది కేంద్రం. సరిగా ఎవరు అయితే పని చేయకుండా తప్పించుకుంటారో వారికి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతుంది కేంద్రం. ఒక బిల్లుని లోక్ సభ లో ప్రవేశ పెట్టడానికి రెడీ అవుతున్నారు. 

 

ఈ బిల్లు ఆమోదం పొందితే రెండేళ్ళ లో సదరు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోవాలి. పని తీరులో విఫలం అయిన ఎమ్మెల్యేను తొలగించాలి అనుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటరు స్పీకర్ కు పిటీషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం దానిని పరిశీలించి ఓటింగ్ నిర్వహించగా 75 శాతం పైగా ప్రజలు సదరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇక ఉప ఎన్నిక ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: