ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏమో గాని మన దేశంలో ప్రతీ రోజు వేల కేసులు నమోదు కావడం ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. అసలు కేసులు ఏ విధంగా నమోదు అవుతున్నాయి అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. లాక్ డౌన్ ఉంటే కరోనా కట్టడి అవుతుంది అని భావించారు. 

 

ఇప్పుడు అంటే సడలింపు లు ఇచ్చారు గాని మొన్నటి వరకు ఏమీ లేవు. అంత కఠినం గా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అనేది చాలా మందికి అర్ధం కావడం లేదు. ఇంకెన్ని రోజులు లాక్ డౌన్ ఉంటుంది, అసలు కేసులు ఎప్పుడు కట్టడి లోకి వస్తాయి అనే ప్రశ్న సామాన్యుల నుంచి వినపడుతుంది. కేసులు పెరుగుతున్నాయి అంటే లాక్ డౌన్ వలన ఏం ఉపయోగం అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: