దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ కి ఇప్పుడు సర్వం సిద్దమైంది. నేడో రేపో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ ల విషయంలో ఏ నిర్ణయ౦ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. రెడ్ జోన్ మినహా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి మినహాయింపులు ఇవ్వడానికి ఇప్పుడు కేంద్రం సిద్దమైంది. 

 

దేశ వ్యాప్తంగా గ్రీన్ జోన్స్ లో పూర్తిగా ప్రజా రవాణాకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రీన్ జోన్ టూ గ్రీన్ జోన్ లో అనుమతి ఇవ్వాలని, రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో ఒకటికి  పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది. గ్రీన్ జోన్ లో షాపింగ్ మాల్స్ సినిమాలు మినహా అన్నీ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: