పేస్ బుక్ ఇప్పటికే తన శాఖలను విస్తృతంగా విస్తరిస్తూ పోతూవుంది. ప్రస్తుతం పేస్ బుక్ సంస్థాగతమైన వాట్సాప్ ఇప్పుడు  కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తరపున ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఇండియన్ యాంటీ ట్రస్ట్ వాట్సాప్‌ యొక్క పనితనాన్ని విస్తుతంగా పరిశీలిస్తోందని ముగ్గురు రైటర్ల బృందం తెలియజేసింది. వాట్సాప్ ఇప్పటికే మెసేజింగ్ విభాగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా వాట్సాప్ నుండి డిజిటల్ చెల్లింపులను మొదలు పెట్టింది అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా పదిలక్షల మంది ఈ సేవలను అందుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఓ లాయర్ చేత ఈ కేసు ఫైల్ చేయబడినట్లు సీసీఐ చెబుతోంది. కానీ ఆ లాయర్ వివరాలను సీసీఐ ఇంకా బయట పెట్టలేదు.

IHG's ...

 

ఈ పిటిషన్ లో సదరు సంస్థ తన మెస్సేజింగ్ సేవలతో కలిపి డిజిటల్ సేవలను అందించడానికి సిద్ధమైందని ఆరోపించింది. ఇది రాబోయే రోజుల్లో కొన్ని విపత్కర పరిణామాలకు దారితీయవచ్చని అభిప్రాయపడింది. ఇప్పటికే పదిలక్షల వినియోగదారులు ఉన్న ఈ సంస్థ భరత్ లోని దాదాపు 400 మిలియన్ల వినియోగదారులకు తన సేవలను విస్తరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. అయితే పేస్ బుక్ మరియు వాట్సాప్ దీని ఫై ఇప్పటివరకు స్పందించలేదు. అదేవిధంగా మొదట సీసీఐ పట్టించుకోనట్లు కనిపించినా పిటిషన్ ను పదే పదే దాఖలు కావడంతో సీసీఐ ప్రస్తుతం పరిశీలిస్తోంది.

 

 

డేటా నిల్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున వాట్సాప్ తన చెల్లింపుల సేవను విస్తరించడానికి అనుమతించవద్దని భారతీయ లీగల్ థింక్ ట్యాంక్ గత నెలలో సుప్రీంకోర్టులో కేసు వేసింది. మే 13 న కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఈ కేసుపై తన అభిప్రాయాలను సమర్పించాలని భారత రెగ్యులేటర్లను కోరినట్లు వాట్సాప్ కోర్టుకు తెలిపింది. గత ఏప్రిల్ లో ఫేస్‌బుక్ భారతదేశ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డిజిటల్ ఆర్మ్‌లో 9.99% వాటాను కొనుగోలు చేయడానికి 5.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. దీని ద్వారా  కిరాణా మరియు చిన్న వ్యాపారాల కోసం సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: