పర్వీన్ కష్వాన్...  వైరల్ వీడియో లను ఎక్కువగా చూసే భారతీయులకు ఈ పేరు సుపరిచితం. భారత అటవీ శాఖ అధికారిగా ఉన్న కష్వాన్ షేర్ చేసే వీడియో లు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అడవుల్లో జరిగే అనేక విషయాలను ఆయన పోస్ట్ చేస్తూ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. 

 

దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో ఆయనకు దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక ఆయనకు అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన వీడియో లను, ఆయన ఫోటోలను వాళ్ళు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో సమర్ధ అధికారిగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: