కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.  దాదాపు 55 రోజుల తర్వాత శ్రీవారి లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో శ్రీవారి లడ్డూ కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులకు గత 55 రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు.  లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం.

 

దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ ఆలయంలో స్వామి వారి నిత్య కైంకర్యాలను అర్చకులు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించే యోచనలో అర్చకులు ఉన్నట్లు తెలుస్తోంది.  సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపిలో కొన్ని చోట్ల లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: