ఆస్ట్రేలియా క్రికెట్ లో స్టీవ్ వా, షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టుని అగ్ర స్థానంలో ఉంచడానికి వారు ఇద్దరూ చాలా కష్టపడ్డారు అనే సంగతి అందరికి తెలిసిందే. బౌలర్ గా షేన్ వార్న్ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తే కెప్టెన్ గా బ్యాట్స్మెన్ గా స్టీవ్ వా ప్రత్యర్ధులను సమర్ధంగా ఎదుర్కొని ఆసిస్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. 

 

అయితే వీరు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ప్రతీ సారి ఏదోక రూపంలో వార్న్... వా పై ఏదోక విమర్శ చేస్తూనే ఉన్నాడు. తాజాగా వా పై వార్న్ చేసిన విమర్శ ఆసక్తికరంగా మారింది. అత్యంత స్వార్థపరుడైన క్రికెటర్  స్టీవ్ వా అని, అతను ఎప్పుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడని ఆరోపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: