కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా సహా పలు దేశాలు ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాయి. క్రికెట్ లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అవస్థలు పడుతున్న శ్రీలంక అయితే తమతో ఎవరు అయినా క్రికెట్ ఆడితే బాగుండు అని ఎదురు చూస్తుంది. 

 

ముఖ్యంగా తమతో భారత్ క్రికెట్ ఆడాలి అని కోరుతుంది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. భారత  జట్టుని తమ దేశానికి పంపాలని క్వారంటైన్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేసింది. మ్యాచ్ లను ఖాళీ మైదానాల్లో నిర్వహిస్తామని చెప్పింది. అయితే మూడో విడత లాక్ డౌన్ పూర్తి అవుతున్న నేపధ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: