ఐసోలేషన్ లో ఉంటే కేవలం ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కాని ఉత్తరప్రదేశ్ లోని సికందరాలో ఒక కాలేజ్ లో ఉన్న ఐసోలేషన్ వార్డ్ లో ఒక వ్యక్తి మద్యం బాటిల్ తీసుకుని వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. ఫుడ్ ప్యాకెట్ తో పాటుగా మద్యం బాటిల్ ని కూడా అతను ఆర్డర్ చేసాడు. 

 

అక్కడ ఉన్న సిబ్బంది బాబు ని చెక్ చేయగా మద్యం బాటిల్ చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఈ ఘటనను అక్కడ ఉన్న వారు వీడియో తీసారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. అతను చేసిన తప్పుని అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: