IHG

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిన ఓ ఆహ్లాదకర సమయంలో చిన్న పిల్లవాడిగా మారుతూ ఉంటారు. ఈ విషయం ని పక్కాగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నిజం చేశాడు.అయితే నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తూవుంది.  మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నే ఉంటూ తన కూతురు సితార , కొడుకు గౌతమ్ తో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా మహేష్ బాబు తన కూతురు సితార్ పాప తో కలసి ఓ చిన్న పిల్లవాడిగా మారి ఆడుకోవడం ఆసక్తిని పుట్టించింది.

 

 

అయితే ఈ వీడియో గతంలో తీసినప్పటికి లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే కాలం గడుపుతున్న మహేష్ అండ్ ఫామిలీ ఆ పాత మధుర స్మృతులను నెమరువేసుకుంటున్నారు. నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ....ప్రేమ, జీవితం మరియు నవ్వు ❤️❤️❤️ MB మరియు సితు పాపా యొక్క చిన్న టెడ్డి కచేరీ- ఆమె మాత్రమే అతనిలోని పిల్లవాడిని బయటకు తీసుకురాగలదు.. #మెమొరీథెరపీ ప్రతి రోజు ఒకటి ..అంటూ  పోస్ట్ చేసింది...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: