హైదరాబాద్ శివారులోని కాటేదాన్‌లో రోడ్డుపై కనిపించిన చిరుత ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజేంద్రనగర్‌లోని హిమాయత్ సాగర్ వద్ద నీళ్లు తాగుతుండగా స్థానిక మత్సకారులు చూసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత ఆనావాళ్లను సేకరించారు. కాగా, చిరుత ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని ప్రజలు భయపడుతున్న వేళ దాని ఆచూకీ కనుగొనేందుకు సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆ చిరుత తాజాగా హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు.

 

ఇదిలా ఉంటే హిమాయత్ సాగర్ వద్ద నీళ్లు తాగుతూ చిరుత తమకు కనిపించిందని కొంత మంది అనడంతో వెంటనే అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుంది. మరోవైపు గాయపడ్డ చిరుత  చనిపోయిందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిరుత సురక్షితంగానే ఉందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: