ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదికి లేఖ రాశారు.. ఆర్ధిక కార్యకలాపాల పునఃప్రారంభానికి మరికొన్ని సడలింపులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.  కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో అన్ని మాల్స్, రెస్టారెంట్లు, మెట్రో సర్వీసులు వంటివాటిని తెరవాలని ప్రధాని మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... అయితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. కొన్ని ష‌రతుల‌తో ప్రారంభిస్తామ‌ని, మాస్కులు, భౌతిక దూరం లాంటి నియ‌మాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా ఆదేశాలు జాయ్ చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రివాల్ లేఖ‌లో పేర్కొన్నారు. లాక్డౌన్ సడలించిన తరువాత, కరోనావైరస్ కేసులు పెరుగుతాయని అంచనా వేస్తున్నామన్న కేజ్రీవాల్.

 

ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఆసుపత్రులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అంబులెన్సులు, ఐసియులు మొదలైనవి ఏర్పాటు చేసినట్టు అని ఆయన చెప్పారు. అయితే లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత ఢిల్లీలో క‌రోనా కేసులు పెరిగే అవ‌కావం ఉంద‌ని, అందుకు అణుగుణంగానే హాస్పిట‌ల్స్‌లో వెంటిలేటర్లు, ఐసీయూ, అంబులెన్సులు మెద‌లైన వాటిని పెంచామని తెలిపారు. అయితే అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్ సెంట‌ర్లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం య‌థ‌విదిగా మూసివేయ‌బ‌డ‌తాయి.  ఈ నేప‌థ్యంలో దాదాపు 5 ల‌క్ష‌ల ప్ర‌జానీకం త‌మ విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు పంపించారు. దీనికి అనుగుణంగానే ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌ర‌మైన సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించేలా మోదీకి రాసిన లేఖ‌లో వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: