ఒక పక్క కరోనా వైరస్ తో బాగా ఇబ్బంది పడుతున్న రైతులకు వర్షాలు మరింత ఇబ్బంది గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తుఫాన్ ప్రభావం తో ఇప్పుడు మిర్చి రైతులతో పాటుగా అరటి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

 

రాబోయే రెండు మూడు రోజుల్లో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షాలు కూడా పడే అవకాశం ఉందని, కాబట్టి వెంటనే అప్రమత్తమై పంటలను చేలల్లో ఉంచవద్దు అని సూచనలు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలకు తక్కువగానే ఉన్నా దిశ మారిస్తే ఏమీ చేయలేమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: