అమ్మ ప్రేమ ఈ విశ్వంలో దీనికి మించిన ప్రేమ అనేది మనం ఎంత వెతికినా సరే దొరకదు. తన బిడ్డ ప్రాణాల కోసం తల్లి పడే తపన అంతా ఇంతా కాదు. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి తన ప్రాణం పోయినా సరే తల్లి లెక్క చేయదు. నిజ జీవితంలో సినిమాల్లో కూడా మనం ఇవి చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 

 

భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ షేర్ చేసిన ఒక వీడియో లో కరెంట్ తీగల మీద తన బిడ్డ చిక్కుకుని ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించిన ఒక తల్లి... కరెంట్ తీగల మీదకు దూకి తన బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది. ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూనే పలు ప్రయత్నాల తర్వాత కాపాడుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: