ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని సినిమా షూటింగ్ లు దాదాపుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు దేశంలో జరిగే అవకాశం దాదాపుగా లేదు అనే చెప్పాలి. మన తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కూడా దాదాపుగా ఆగిపోయాయి. ఎప్పుడు షూటింగ్ కి వెళ్తాయి సినిమాలు అనేది స్పష్టత రావడం లేదు. 

 

ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలు గా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి రామ్ చరణ్ ఒక ప్రకటన చేసారు. సెట్స్‌ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు, ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి అంటూ సెట్స్ లో దిగిన ఒక ఫోటో షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: