ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులు, వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజలు పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వారు తెలిపారు.  శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీనికి తోడు..భారీగా ఈదురు గాలులు వీచాయి.  ఈ నేపథ్యంలో  మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం, మున్ననూర్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మున్ననూర్ దగ్గర ఉన్న టోల్ గేట్ కోసం ఏర్పాటు చేసిన రేకులు గాలికి ఊడిపడి.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టోల్ గేట్ వద్ద వడ్లు ఆరబెట్టిన కృష్ణయ్య, పుష్ప దంపతులు వాటి కావలి ఉన్నారు. గాలి బీభత్సానికి టోల్ గేట్ రేకులు ఎగిరి వడ్ల వద్ద ఉన్న కృష్ణయ్య, పుష్పల మీద పడ్డాయి. దాంతో వారు మృతి చెందారు. 

 

ఇదిలా ఉంటే..  మున్ననూర్ కు చెందిన కృష్ణయ్య, పుష్ప దంపతులు. వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మున్ననూరు శివారులో మహబూబ్ నగర్-కోదాడ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న టోల్ గేట్ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు.  ఇక తల్లిదండ్రుల మృతదేహాలను చూసి పిల్లలు బోరున విలపిస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. అమ్మా లే అమ్మా అంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: