దేశంలో కరోనా మహమ్మారి  రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఇక కరోనా ఎప్పుడైతే ప్రబలిపోతుంది.. దేశంలో మహరాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో ఎక్కువ ప్రభావం చూపుతూ వచ్చింది.  మహారాష్ట్రాలో అయితే మరీ దారుణంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  ఆ తర్వాత తమిళనాడు లో మోత మోగుతుంది.  తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు నేడు ఒక్కరోజే 477 నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 332 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,585కు చేరుకుంది.  ఇక  కరోనా వైరస్  కారణంగా శనివారం ముగ్గురు వ్యక్తులు మరణించారు.

 

వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 74 మంది చనిపోయారు. మొదటి నుంచి తమిళ నాటు లాక్ డౌన్ సీరియస్ గానే వ్యవహరిస్తున్నా ఇటీవల వలస కార్మికులు మళ్లీ తమ గమ్యస్థానాలకు చేచుకోవడం.. వారికి పరీలు నిర్వహించడంతో కేసులు పెరిగిపోతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. తాజాగా తమిళనాట వెలువడిన బులిటన్ ప్రకారం ఈరోజు ఒక్కరోజే 477 నమోదయ్యాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: