కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పదో తరగతి విద్యార్ధులు చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో పదో తరగతి పరిక్షల మీద స్పష్టత రావడం లేదు. ఇక కొన్ని రాష్ట్రాలు సామాజిక దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. 

 

చదివిన స్కూల్ లోనే పదో తరగతి పరిక్షలు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 21లోగా ఉపాధ్యాయులందరూ తాము పనిచేస్తున్న పాఠశాలలకు చెందిన జిల్లాలకు తరలిరావాలని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలల హెచ్‌ఎంలు  టెన్త్‌ విద్యార్థులందరినీ పరీక్షలు  రాయడానికి  చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. మూల్యాంకనం కూడా ఇలాగే చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: