ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాన్ ఇప్పుడు వేగంగా దూసుకువస్తుంది. పారాదీప్ కి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావం తో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర కు భారీ వర్ష పాతం ఉంటుంది అని అధికారులు పేర్కొన్నారు. 

 

బెంగాల్ సహా ఓడిస్సా ఏపీ ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుఫాన్ గంట కు ఆరు కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది. రేపటికి తీవ్ర తుఫాన్ గా బలపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ప్రభావం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కనపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణా మీద కూడా కాస్త పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: