లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీ వారి ఆలయాన్ని మూసి వేసారు. మే 31 వరకు శ్రీ వారి ఆలయాన్ని తెరిచే అవకాశమే లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీవారి ధర్శనాలకు అనుమతి ప్రభుత్వం నుంచి వస్తే... కరోనా జాగ్రత్తలు తీసుకుని తిరిగి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే బోర్డ్ లో చర్చలు కూడా జరిగాయి. 

 

భక్తులు భౌతికదూరం పాటించడం, అక్కడి భద్రతా సిబ్బంది వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని.. భద్రత కల్పించే విధంగా శ్రీ వారి దర్శనం చేసుకునే విధంగా క్యూలైన్లలో మార్కింగ్‌ చేస్తున్నారు. లడ్డూ కౌంటర్లలో వైట్‌ లైన్స్‌ ఏర్పాటు చేశారు. శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి శ్రీవారి ఆలయ మహద్వారం వరకు, బయోమెట్రిక్‌ ప్రాంతంలోనూ రెడ్‌ లైన్స్‌ ఏర్పాటు చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: