తుఫాన్ వేగంగా దూసుకుని రావడంతో ఇప్పుడు ఓడిస్సా బెంగాల్ రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఇప్పుడు అప్రమత్తమవుతుంది. తుఫాన్ ని ఎలా అయినా సరే ఎదుర్కోవడానికి సిద్దమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేక బృందాల దిశగా అడుగులు వేస్తున్నారు. 

 

ఓడిస్సా రాష్ట్రంలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, పూరి, జగత్సింగ్‌పూర్, జాజ్‌పూర్, మయూరభంజ్ జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) 10 బృందాలను మోహరించారు. కటక్‌లోని 3 వ ఎన్‌డిఆర్‌ఎఫ్ బిఎన్ ముండలిలో 7 జట్లు ఉన్నాయి. ఇక బెంగాల్ ప్రభుత్వం కూడా తీర ప్రాంత గ్రామాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: