ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ మద్య బాలీవుడ్ స్టార్ హీరోలు ఇర్ఫాన్ పటాన్, రిషీ కపూర్ చనిపోయారు.  మరో నిర్మాత చనిపోయారు.  మరొక  కెమెరామాన్, అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూశారు.  తాజాగ ప్రముఖ ‌  హిందీ టీవీ నటుడు, పలు సీరియళ్లలో పంజాబీ, సిక్కు పాత్రల్లో క‌నిపించిన‌ మన్మీత్ గ్రెవాల్(29) ఆత్మహత్య చేసుకున్నాడు. షూటింగ్‌లు ఆగిపోవ‌డం, ఆర్థిక ఇబ్బందులు, మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా మ‌న్మీత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలుస్తోంది.  గత కొంత కాలంగా వరుస గా షూటింగ్స్ క్యాన్సల్ అయ్యాయి.  సినీ, బుల్లితెర నటులు ఇంటి పట్టున ఉంటున్నారు. 

 

కొంత మంది పరిస్థితి ఎలా ఉన్నా.. మరికొంత మంది ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో కొనసాగుతున్నాయి.  తాజాగా మ‌న్మీత్ ముంబైలోని నవీ ముంబైలో ఉంటున్నాడు. ఇటీవల కుల్‌దీపక్ అనే టీవీ సీరియల్‌లో మన్మీత్ కనిపించాడు. ఢిల్లీకి చెందిన మ‌న్మీత్‌ వివాహం అనంత‌రం ముంబైకి వచ్చాడు.  ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన మ‌న్మీత్‌ వివాహం అనంత‌రం ముంబైకి వచ్చాడు. మన్మీత్ తన భార్యతో కలిసి నవీ ముంబైలోని ఒక చిన్న ఫ్లాట్‌లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మ‌న్మీత్ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: