IHG

కరోనా మహమ్మారి రోజురోజుకు తన వికృత రూపాన్ని నలుదిశలా విస్తరిస్తూ పోతూవుంది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూవుంది. దీని భారిన పడి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి . ఇప్పటికే 3లక్షలకు పైగా మరణాలు ఈ మహమ్మారి కారణంగా సంభవించాయి. కరోనా వ్యాపిస్తున్న తొలినాళ్లలో ఈ వైరస్ అంతంత మాత్రమే ఉన్న తబ్లీగీ జమాత్ మత ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా దేశంలో కవిడ్-19  కేసులు పెరిగాయి. అయితే ఈ పాజిటివ్ కేసుల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా భోపాల్ లో టాగ్లిబీ జమాత్ ప్రార్థనలకు వచ్చిన 60 మంది మత పెద్దలను భోపాల్ పోలీస్ యంత్రాంగం అరెస్టుచేశారు.

 

 

అయితే వీరు  కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజక్‌స్థాన్‌, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్‌ దేశాలకు చెందిన వారు గా గుర్తించారు. అయితే వారంతా టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చి, ఇక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో వారు కోర్టుకు వినతి సమర్పించగా కోర్ట్ ఆ వినతిని తోసిపుచ్చింది దింతో పోలీసులు వారిని భోపాల్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిపై వీసా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే భోపాల్‌లోని పోలీసు స్టేషన్లలో 7 కేసులు నమోదయ్యాయి. భోపాల్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: