దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కేంద్రం మరో 14 రోజుల పాటు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపధ్యంలో రాష్ట్రాల సరిహద్దుల మీద కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. ఆరెంజ్ జోన్ ఆరెంజ్ జోన్ జిల్లాలను అనుమతి ఇవ్వాలని, గ్రీన్ జోన్ టూ గ్రీన్ జోన్ అనుమతి ఇవ్వాలని, కంటైన్మేంట్ జోన్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటే ఆ సరిహద్దుని మూసి వేస్తారని అంటున్నారు. 

 

ఉదాహరణకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కేసులు ఏమీ లేవు అనుకుందాం. పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డి గూడెం లో కేసులు లేవు. అప్పుడు వాటికి అనుమతి ఇస్తారు.  సత్తుపల్లి లో కేసులు ఏమీ లేవు, సరిహద్దున ఉన్న కృష్ణా జిల్లా తిరువూరు లో కేసులు ఉంటాయి. అప్పుడు సరిహద్దుని మూసి వేస్తారు. అలాగే గ్రీన్ జోన్ జిల్లాకు ఆరెంజ్ జోన్ లేదా రెడ్ జోన్ జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసి వేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: