దేశంలో ఓ వైపు లాక్ డౌన్ కంటిన్యూ అవుతుంది.. ఈ నేపథ్యంలో వలస కూలీలు నానా కష్టాలు పడుతూ రొడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లున్నారు. మరొకొంత మంది తమకు దొరికిన వాహనాల్లో వెళ్తున్నారు.  ఇలా సుదూర ప్రాంతా నుంచి వస్తున్న వారి వద్ద కొంత మంది పోలీసలు లంచాలు వసూళ్లు చేస్తూ అప్పుడప్పుడు మీడియా కంట పడుతున్నారు.  లాక్‌డౌన్‌లో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఒకరి నుంచి డబ్బులు వసూలు చేసిన పెట్రో మొబైల్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మహారాష్ట్ర నుంచి పరుశురాం అనే వ్యక్తి పద్మానగర్‌ ఫేజ్‌-2కు ఇటీవల వచ్చాడు. విచారణ నిమిత్తం పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన పెట్రో మొబైల్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌ వారి ఇంటికి వెళ్లాడు.

 

నానా ఇబ్బందు పడుతున్న వారి నుంచి పరుశురాం నుంచి రూ. 500 డిమాండ్‌ చేశాడు. తమ వద్ద డబ్బు లేదని ఎంత చెప్పినా.. వినలేదు. అంతే కాదు ఓ పే యాప్ ద్వారాడబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో రూ.300 వేశాడు.  తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు,  మంత్రులతో పాటు పలువురికి  సోషల్ మెసేజ్  ద్వారా తెలియపరిచాడు. ఈ విషయం పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో కానిస్టేబుల్‌ రవీందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: