టీవీ నటుడు మన్‌మీత్ గ్రేవాల్ తన ఇంట్లోఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో షూటింగ్ లు లేకపోవడం దానికి తోడు అప్పుల వాళ్ళు అతని మీద ఒత్తిడి తీసుకుని రావడం తో ఎం చెయ్యాలో అర్ధం కాని అతను ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

అతని భార్య వంట గదిలో వంట చేస్తున్న సమయంలో 32 ఏళ్ళ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెడ్ రూమ్ నుంచి సౌండ్ రావడంతో ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా అతను ఫ్యాన్ కి వేలాడుతున్నాడు. గట్టిగా అరవడం తో అక్కడ ఉన్న చుట్టూ పక్కల వారు అతన్ని ఫ్యాన్ నుంచి కిందకు దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని మరణానికి ఒక నిర్మాత కారణం అని, అతనికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత వద్దని ఆ తర్వాత ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి అడగడం తో ఏం చెయ్యాలో అర్ధం కాక ఆత్మహత్య చేసుకున్నాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: