దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో క‌రోనా వైర‌స్ తీవ్ర రూపం దాల్చుతోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేప‌థ్యంలో కొవిడ్‌ -19 చికిత్స కోసం బెడ్ల‌ సామర్థ్యాన్ని లక్షల్లో పెంచాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించినట్లు పౌర కమిషనర్ ఐఎస్ చాహల్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో 30,706 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 1,135 మంది మరణించారు. దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో నిలిచింది.
 
ఈ సంద‌ర్భంగా చాహ‌ల్ మాట్లాడుతూ.. క్వారంటైన్ సౌకర్యం కోసం వాంఖడే స్టేడియం ప్రిమిసెస్‌ను బీఎంసీ తీసుకోదని స్పష్టం చేశారు. *మేము క్రికెట్ స్టేడియం లేదా మరే ఇతర బహిరంగ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఎందుకంటే ముంబైలో కొన్నిసార్లు ఒక వారం పాటు నిరంతరం వర్షాలు కురుస్తాయి. ప్రజలను జాగ్రత్తగా చూసుకోవటానికి పరిపాలనకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు* అని ఆయ‌న పేర్కొన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: