నాలుగో విడత లాక్ డౌన్ ని కొనసాగించడానికి మొగ్గు చూపిన కేంద్ర ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్ డౌన్ ని కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సిద్దం చేసింది. కాసేపటి క్రితం వాటిని విడుదల చేసింది. సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ స్విమ్మింగ్ ఫూల్స్ పై నిషేధం ఉంటుంది అని స్పష్టం చేసింది. 

 

సినిమా హాల్స్ ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సినిమా హాల్స్ విషయంలో కేంద్రం ఈ విధంగా సూచనలను ఇవ్వడం తో మరోసారి సినీ పరిశ్రమ షాక్ అయింది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండి కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: