IHG

చేతినిండా డబ్బులేదు. పోనీ ఇక్కడే ఉండిపోదామంటే నాలుగు వేళ్ళు కడుపులోకి వేళ్ళని దుస్థితి. అలాగని నడచి వెల్దామనుకుంటే నడవలేని కుమారుడు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న ఓ వలసకూలీ నిస్సహాయస్థితిలో తప్పని తెలిసినా తప్పని స్థితిలో దొంగ తనానికి పూనుకున్నాడు. అయితే నడవలేని కుమారుడి కోసం ఇంటిబయటే ఉన్న ఓ సైకిల్ వైపు ఆశగా చూశాడు బయట ఎవరు లేకపోవడంతో సైకిల్ ని దొంగ తనం చేయడానికి దాని దగ్గరవరకు వెళ్లి మల్లి మనసు ఒప్పక తిరిగి వెళ్ళిపోయాడు .

 

 

 

కానీ తన కుమారుడుని నడిపించలేని పరిస్థితి అయితే తప్పని పరిస్థితిలో తిరిగి మళ్లీ ఆ సైకిల్ వద్దకే వచ్చి సైకిల్ ఓనర్ ని క్షమాపణ కోరుతూ ఓ లెటర్ ని రాసిపెట్టి ఆ సైకిని తీసుకోని వెళ్ళిపోయాడు . రాజస్థాన్లోని భరత్పూర్ లో జరిగిన ఈ సంఘటన మనసున్న ప్రతి ఒక్కరిని కలచివేసింది. యూపీ లోని బరేలీకి చెందిన మహమ్మద్ ఇక్బల్ ఖాన్ రాజస్థాన్లోని భరత్పూర్ లో నివాసముంటున్నాడు. అతడికి దివ్యానంగుడైన ఓ కుమారుడు ఉన్నాడు. అయితే లాక్ డౌన్ విధించడంతో జీవనాధారం లేక ఇబ్బంది పడ్డ అతను చేసేది ఏమిలేక తన సొంత ఊరు అయిన యూపీ లో ని బరేలీకి ఎలాగైనా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

 

IHG

నడవలేని స్థితిలో ఉన్న కుమారుడుని తన గ్రామం కి చేర్చేందుకు అతనికి ఆ సైకిల్ ని దొంగిలించక తప్పలేదు. ఆ వలస కూలి ఆ లెట్టర్లో ..." విధిలేని పరిస్థితిలో మీ సైకిల్ ని దొంగ తనం చేస్తున్నాను వీలైతే నన్ను క్షమించండి. మేము బరేలి వెళ్ళాలి .నాకో కుమారుడు ఉన్నాడు ..వాడు నడవలేడు..వాడి కోసం ఈ దొంగతనం చేయక తప్పలేదు " అని చెప్పి లెటర్ లో వివరణ ఇచ్చాడు ..అయితే సైకిల్ ఓనర్ మొదట్లో సైకిల్ దొంగతనం చేయడంపై కోపగించిన అతను పోలీస్ లను ఆశ్రయించాడు కానీ అతని బాధను అర్థం చేసుకున్న తరువాత ..ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ...

మరింత సమాచారం తెలుసుకోండి: