న‌టులు రాహుల్ విజ‌య్‌, ఆకాశ్‌పూరిలు చేసిన  ఒక్క‌ఛాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్టార్ హీరోల సినిమాల్లోని డైలాగ్స్‌ను చెబుతూ ఇద్ద‌రూ ఈ వీడియ‌లో ఇర‌గ‌దీశారు. బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మ‌హేశ్‌బాబు త‌దిత‌ర స్టార్ హీరోల సూప‌ర్ హిట్ డైలాగ్స్ సూప‌ర్బ్‌గా చెప్పేశారు. చివ‌ర‌లో ఒక్క‌ఛాన్స్‌.. ఒకేఒక్క‌ఛాన్స్‌..! అంటూ ముంగించేశారు. అయితే.. ఈ వీడియోపై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి స్పందించారు. సూప‌ర్బ్ అబ్బాయిలు.. ఇద్ద‌రూ చింపేశారు..! అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కాంప్లిమెంట్‌కు ఆకాశ్ పూరి ఎగిరిగంతేశారు.. థ్యాంక్యూ సో మ‌చ్ స‌ర్‌.. కానీ ఒక్క‌ఛాన్స్ స‌ర్‌.. ప్లీజ్ గుర్తుంచుకోండి స‌ర్‌.. అంటూ ఆకాశ్‌పూరి కోరాడు. అలాగే.. సోష‌ల్ మీడియాలోనూ ఈ వీడియ‌పై కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

 

తమిళ్ లో అగ్ర హీరోలు, అంతా దర్శకుల వారసులే! కానీ, తెలుగులో మాత్రం దర్శకుల వారసులని ఆ స్థాయి హీరోలను చెయ్యలేకపోతున్నాం. తెలుగు సినిమాకీ "ఇంగ్లీష్ లెక్చరర్" లాంటోడు పూరి జ‌గ‌న్నాథ్‌.. మన దర్శకుడి వారసుడిని అగ్ర హీరోలలో ఒకడిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం.. అనిల్ రావిపూడిగారు.. అంటూ కొంద‌రు కామెంట్స్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: